Blogger Widgets

బుధవారం, ఏప్రిల్ 03, 2024

పియర్ జాన్సన్ @ హీలియం (chemistry helium gas)

బుధవారం, ఏప్రిల్ 03, 2024

1868లో పియర్ జాన్సన్ అనే ఫ్రెంచి ఖగోళ శాస్త్రజ్ఞుడు ఒక సూర్య గ్రహణం పరిశోధన సమయంలో ఒక క్రొత్త పసుపు రంగు స్పెక్ట్రల్ లైన్ కనుగొన్నాడు. ఇది హీలియం మూలకం సూచించే స్పెక్ట్రల్ లైను. నార్మన్ లాక్యర్ అనే మరో శాస్త్రవేత్త ఇదే గ్రహణాన్ని పరిశీలిస్తూ "హీలియం" అనే క్రొత్త మూలకం పేరు ప్రతిపాదించాడు. వీరిద్దరూ హీలియంను కనుగొన్నవారిగా గుర్తింపు పొందారు.
హీలియం (Helium) ( సంకేతం He) , ఒక రంగు, రుచి, వాసన లేని, హానికరం గాని (non-toxic), తటస్థమైన  ఒకే అణువు కలిగిన (monatomic రసాయనమూలకము. ఇది ఆవర్తన పట్టికలో ఉత్కృష్ట వాయువుల జాబితాలో ప్రధమంగా వస్తుంది. దీని పరమాణు సంఖ్య 2. దీని మరిగే ఉష్ణోగ్రత మరియు ద్రవీకరణ ఉష్ణోగ్రతఅన్ని మూలకాలలో అతి తక్కువ. ఇది దాదాపు అన్ని పరిస్థితులలోను వాయువుగానేఉంటుంది.
1903లో అమెరికా సహజ వాయువు నిల్వలలో పెద్ద మోతాదులో హీలియం కూడా ఉన్నట్లు గుర్తించారు. హీలియంను అధికంగా క్రయోజెనిక్స్ (cryogenics) సాంకేతికతలోను, సముద్రపు లోతులలో శ్వాసపీల్చడానికి వినియోగించే పరికరాలలోను (deep-sea breathing systems), అతివాహక అయస్కాంతాలను కూలింగ్ చేయడానికి, హీలియం డేటింగ్ ప్రక్రియలోను, బెలూన్లను ఉబ్బించడానికి, ఎయిర్ షిప్ (airships)లను తేలికగా చేయడానికి వాడుతారు. ఇంకా అనేక పారిశ్రామిక వినియోగాలున్నాయి. ఉదా: arc welding సిలికాన్ వేఫర్స్(silicon wafers) తయారీ వంటివి.  కొద్ది మోతాదులో హీలియం నాయువును పీల్చినట్లయితే మనిషి మాటలోని గరుకుదనంలో (timbre and quality) కొంత తాత్కాలికమైన మార్పు వస్తుంది.క్వాంటమ్ మెకానిక్స్ అధ్యయనం చేసే శాస్త్రవేత్తలకు హీలియం ద్రవరూపపు (liquid helium-4's two fluid phases, helium I and helium II) లక్షణాలు చాలా ఉపయోగకరమైనవి. ముఖ్యంగా super fluidity అధ్యయనంలోను, absolute zero వద్ద పదార్ధపు లక్షణాలను అధ్యయనం చేసే అతివాహకత (superconductivity) పరిశోధనలలోను.

అన్ని మూలకాలలోను హీలియం రెండ అతి తేలికైన మూలకం. మరియు విశ్వంలోఅత్యధికంగా లభించే రెండవ పదార్ధం. నిశ్వంలో హీలియం అధికంగా మహా విస్ఫోటనం(Big Bang) సమయంలో ఏర్పడింది. అంతే గాకుండా నక్షత్రాలలో హైడ్రోజెన్మూలకం న్యూక్లియర్ ఫ్యూషన్ (en:nuclear fusion) కారణంగా హీలియంగా మారుతుంటుంది. భూమిమీద మాత్రం హీలియం పరిమాణం చాలా తక్కువ. భూమి మీది హీలియం కొన్ని మూలకాల రేడియో యాక్టివ్ డికే (radioactive decay) కారణంగా తయారౌతున్నది. ఇలా తయారైన హీలియం సహజ వాయువులో కలిసి ఉంటుంది. దానిని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ (fractional distillation) ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు..
పేరుసంకేతముపరమాణు సంఖ్య : హీలియం, He, 2
ఎలక్ట్రాన్ విన్యాసం : 1s2
ప్రామాణిక పరమాణు భారం :4.002602(2) g·mol−1
రసాయన సిరీస్ : జడ వాయువులు
గ్రూపుపీరియడ్బ్లాక్ : 181s

గురువారం, ఫిబ్రవరి 15, 2024

అర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ఆదిదేవుడు సూర్యనారాయణ మూర్తి

గురువారం, ఫిబ్రవరి 15, 2024

 నమస్కారిస్తే ఆయురారోగ్యాలుఅర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు సూర్యడు.  


ఆదిదేవ ! నమస్తుభ్యం – ప్రసీద మమ భాస్కర |

దివాకర ! నమస్తుభ్యం – ప్రభాకర నమోస్తుతే

2. సప్తాశ్వరథ మారూఢం – ప్రచండం కశ్యపాత్మజం |

శ్వేతపద్మధరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌

3. లోహితం రథమారూఢం – సర్వలోకపితామహం |

మహాపాపహరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

4. త్రైగుణ్యం చ మహాశూరం – బ్రహ్మ విష్ణుమహేశ్వరమ్‌ |

మహాపాపహరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌

5. బృంహితం తేజసాంపుంజం – వాయు రాకాశ మేవ చ |

ప్రియంచ సర్వలోకానాం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

6. బంధూకపుష్పసంకాశం – హారకుండభూషితం |

ఏకచక్ర దరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

7. తం సూర్యం లోకకర్తారం – మహాతేజ: ప్రదీపనమ్‌|

మహాపాపహరం దేవం- తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

8. తం సూర్యం జగతాం నాథం – జ్ఞానప్రకాశ్యమోక్షదమ్‌ |

మహాపాపహారం దేవం – తం సూర్యం ప్రణ మామ్యహమ్‌.

9. సూర్యాష్టకం పఠేన్నిత్యం – గ్రహపీడా ప్రణాశనం |

అపుత్రో లభతే పుత్రం – దరిద్రో ధనవా న్భవేత్‌ |

10. ఆమిషం మధుపానం చ య: కరోతి రవేర్ధినే|

సప్త జన్మ భవేద్రోగి – జన్మ జన్మ దరిద్రతా |

స్త్రీ తైలమధుమాంసాని – యే త్యజంతిరవేర్దినే |

న వ్యాధి: శోకదారిద్య్రం – సూర్యలోకనం చ గచ్ఛతి.

ఆదిదేవ ! నమస్తుభ్యం – ప్రసీద మమ భాస్కర |

దివాకర ! నమస్తుభ్యం – ప్రభాకర నమోస్తుతే

ఓ ఆది దేవా ! నీకు నమస్కారము. భాస్కరా! నన్ను కరుణించు  . ప్రభాకరా నీకు ప్రణామములు అంటు సూర్యునికి ప్రతినిత్యము నమస్కారములు చేస్తే ఆయురారోగ్యాలు, అర్ఘ్యమిసే చాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్షభగావానుడు సూర్యుడు.

మాఘమాసములో వచ్చే శుద్ధ సప్తమి తిధి కి రధసప్తమి అను పేరు. ఇది సూర్యునికి సంబందించిన రోజు . ఇది ముఖ్యముగా సూర్యభగవానుని ఆరాధించు పండుగ. ఈ రోజు సూర్యడు తన రధమును ఉత్తరం దిక్కునకు మళ్ళించే రోజు.
ఈ పర్వదినము రోజు కుటుంబములోని వారందరూ తెల్లవారుజామున నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకొని జిల్లేడు ఆకుల్ని భుజాలమీద , తలమీద పెట్టుకొని

"జనని త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే, సప్తమ్యా హ్యదితే దేవి నమస్తే సుర్యమాతృకే "
అనే మంత్రముతో స్నానము చేయాలి, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుడికి  అర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ఇస్తాడు . 
జిల్లేడు పత్రమునే అర్కపత్రమంటారు. ఈ పత్రము సూర్యునికి ఇష్టము.
తులసి కోటని పసుపు, కుంకుమ లతో అలంకరించి, తులసికోట ముందు ముగ్గులు పెట్టాలి. సూర్యబింబం, ఏడు గుర్రాలు, ఏకచక్రము తో బొమ్మ ముగ్గు పెట్టాలి . ముగ్గుమీద ఆవు పిడకలతో కుంపటి ఏర్పరచి దానిమీద గిన్నెలో అన్నం పాయసము వండాలి. కొత్త గిన్నెకి పసుపురాసి, కుంకుమ బొట్టు పెట్టి, ఆవుపాలను మూడుసార్లు పొంగించి , కొత్త బియ్యము, పటికబెల్లము, యాలకులపొడి చేర్చి , నెయ్యి వేసి చక్కగా వుడికించి పాయసముచేయ్యాలి.
పాలు మూడు సార్లు పొంగటమువల్ల ఇంట్లో సిరిసంపదలు పోంగిపోర్లుతాయని నమ్మకము వుంది.
చిక్కుడు కాయలకి చీపురుపుల్లలు గుచ్చి చేసిన రధమును ముగ్గులో పెట్టి, పదిహేను చిక్కుడు ఆకులు పరచి అందులో ఉడికించిన పాయసమును వడ్డించాలి. వాటిలో అగ్నిహోత్రునికి ఐదు ఆకులు అర్పించాలి. తులసి అమ్మవారికి ఐదు , మిగతా ఐదు సుర్యభాగావానునికి నివేదించాలి. సూర్యునికి గంధ , పుష్ప, అక్షతల, షోడపోచార అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఆయనికి ప్రదక్షణాలు చేసి నమస్కారము చేస్తే ఎంతో పుణ్యము వస్తుంది.
సాయమ్త్రము సూర్యుని గుడికి వెళ్లి నమస్కరించాలి.
రధ సప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను, పంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏ డురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.
అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు,శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి.
సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు.
అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.

శనివారం, ఫిబ్రవరి 03, 2024

నేను ఏమీ చేయలేను అనుకునేవారికి భగవద్గీత నుండి సమాధానం

శనివారం, ఫిబ్రవరి 03, 2024

 మనం జీవితంలో ఎన్నో అనుకుంటూ వుంటాం.  కొన్ని పనులు అనుకోగానే అవుతాయి కొన్ని పనులైతే ఎన్నిసార్లు చేపట్టినా అవ్వదు.  అలాంటప్పుడు మనకి నిరాశా నిస్పృహ వస్తాయి.  కొంతమంది అయితే డిప్రషన్లోకి వెళ్ళిపోతారు.  అంతలా చేస్తాయి  నిరాశా నిస్పృహ .   మనం వింటు వుంటాం ప్రతీ సమస్యకి ఒక పరిష్కారం వుంటుంది అని.  మనం ప్రయత్నిస్తూ వుండాలి అంతే. 

కృష్ణుడు భగవద్గీతను అర్జునికి ఒకనికే చెప్పలేదు.  మనకోసం చెప్పివుంటాడేమో .  ఇప్పుడు అందరు ఏదన్న సమస్య వస్తే మానసిక వైద్యునిదగ్గరికి వెల్తూన్నారు. వాళ్లు కౌన్సిలింగ్స్ ఇస్తారు.  అలాగే యుద్దభూమిలో అర్జునుడు తనవారిని చూసి యుద్దం చేయను, చేయలేను అంటూ అర్జుని విషాధం దానితరువాత శ్రీ కృష్ణులువారు భగవద్గీత చెప్పారు.  అయితే మనజీవితంలో అన్వయించుకుంటే    ప్రతీ సమస్యకి భగవత్గీతలో సమాధానం దొరుకుతుంది.  చూసే దృక్కోణం బట్టి సమాధానం వుంటుంది. 

ఈరోజు ఒకసమస్యని చూసి గీతలో కృష్ణుడు ఏమి చెప్పారో చూద్దాంరండి. 

సమస్య ఏమిటంటే :  

ఒకపని తలపెట్టాను. ఆపని ఎన్నిసార్లు చేసినా పూర్తీ అవ్వటంలేదు.. ఏ పని చేసినా మంచి ఫలితాలు రావటంలేదు. కష్టం వృధా అవుతొంది తప్పా మంచి ఫలితం రావటంలేదు.  మనస్సులో ధైర్యంలేదు. నేను ఏమి చేసినా ఇంతే .  ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటుంది . ఏమి చేయాలన్నా భయం నేను చేయగలనా లేదా. ఒకవేళ చేస్తే పర్ఫెక్ట్ అవుతుందో లేదో .  మనసునిండా tension .  మనసు కృంగిపోతుంది.  

ఈ సమస్య సర్వసాధారణంగా మనలో చాలామంది అంటూ ఉంటారు. మనం వింటూనే వున్నాం కదా మరి ఈ సమస్యకి గీత ఏమి చెప్తోందో చుద్దాం.  

నేను ఏమీ చేయలేను అనుకునేవారికి భగవద్గీత నుండి సమాధానం. 


 గీతలో సాంఖ్య యోగము, భగవద్గీతలో రెండవ అధ్యాయంలో మూడవ శ్లోకం చూడండి. 

||శ్లోకము 2-3||

క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్యోత్తిష్ట పరన్తప ||3||

చూడండి. దీని అర్ధం ఏమిటంటే 

“  పార్థా ! పిరికితనాన్ని తెచ్చుకోవద్దు ; అది నీకు ఎంత మాత్రమూ తగదు ; తుచ్ఛమైన హృదయదౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడవు కా ! ”

హృదయ దౌర్భల్యం, పిరికితనం, అధైర్యం వంటివి మన మనసున చేరిన బుద్ది నశిస్తుంది. విచక్షణ జ్ఞానము ఉండదు. 

అందువల్లే ఎంతో గొప్ప సాటిలేని వీరుడు అయిన అర్జునుడు కూడా తనలోని అంతఃశత్రువులైన హృదయ దౌర్బల్యానికి పిరికితనానికి లోనై యుద్ధం చేయకూడదు అనుకున్నాడు. ఒకానొక బుద్ధిశాలి ఎప్పుడూ వర్తమాన పరిస్థితుల వైపు కాక,అంతిమలక్ష్యం వైపు దృష్టిపెట్టాలి.  విజ్ఞతయే ధర్మయుద్ధానికి మూలం . ధర్మయుద్ధమే అంతిమ విజయానికి మార్గం.జీవన సమరంలో వెనుకడుగు వేసే ప్రతి సందర్భంలోనూ మన అడుగులు ముందుకు వేస్తూంటేగమ్యం చేరువ అవుతూ ఉంటుందిచివరికి లక్ష్యాన్ని చేరుతాం . 

పరిష్కారం : ఎప్పుడు నిరుత్సాహ పడకూడదు. నీశక్తి నీలోనే ఉంది . అది నువ్వు గ్రహించాలి. నువ్వు ఇప్పటికే చాలా విజయాలు సాధించావు అలాంటి నువ్వా ఇలా క్రుంగిపోతున్నావా ? లే  దైర్యం తెచ్చుకో .  నీచమైన పిరికితనం వదిలిపెట్టు . ఉత్సాహంతో దైవంమీద భారం వేసి పని మొదలు పెట్టు. తప్పకుండా విజయం సాధిస్తావు. 

ఇదండీ భగవద్గీతలో మన సమస్యకి సాంఖ్యా శాస్త్రంలో సమాధానం దొరికింది.  మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. 

శనివారం, సెప్టెంబర్ 09, 2023

వర్షాలలో ఇన్స్టెంట్ క్రిస్పీకార్న్ సమోసా ఇంట్లోనే చేసుకుని హాయిగా లాగించ...

శనివారం, సెప్టెంబర్ 09, 2023

శనివారం, ఏప్రిల్ 02, 2022

ఉగాది పచ్చడి తయారి పండగ వెనక కధ

శనివారం, ఏప్రిల్ 02, 2022

నమస్కారమండి, అమ్మమ్మ తో నేను చానల్ కి స్వాగతం. ఉగాది పచ్చడి తయారి పండగ వెనక కధ నేను అమ్మమ్మ ఈ వీడియో లు చేయటానికి చాలా కష్టపడుతున్నాము. మీకు కనకా మా వీడియోలు నచ్చినట్టు అయితే మా చానల్ ని సబ్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహింస్తున్నందుకు మీఅందరికీ మా ధన్యవాధములు. Hii everyone welcome to our channel ammamma tho nenu I wish u all a happy ugadi.All of u plz watch full vedio and share ur comments.And also plz tell what u prepared for todays lunch specials,how do u celebrate?

శనివారం, అక్టోబర్ 21, 2017

యమద్వితీయ

శనివారం, అక్టోబర్ 21, 2017

దీపావళి అయ్యిన తరువాత రెండో రోజున జరుపుకొనే అన్నా చెల్లెలా పండుగ భాయ్ దూజ్ అనీ భగిని హస్త భోజనం అనీ యమ ద్వితీయ అని కూడా అంటారు . 
 ఈ పండుగ సోదర సోదరీమణులు మధ్య ప్రేమకు గుర్తు, మరియు వారి మధ్య రక్షణ మరియు ఆప్యాయతని బంధాన్ని బలోపేతం చేయడానికి జరుపుకుంటారు. ఈ పండుగ రోజు సోదరీమణులు వారి సోదరుల నుదురు మీద ఒక పవిత్రమైన తిలకము పెడతారు. సోదరులు వారి జ్ఞాపకార్ధం బహుమతులు ఇస్తారు.భాయ్ దూజ్ పండుగ యొక్క సారాంశం ఇది సోదర  మరియు సోదరీమణులు మధ్య ప్రేమ బలోపేతం చేయడానికి జరుపుకుంటారు . ఇది సోదరుడుకు సోదరి భోజనం పెడుతుంది అప్పుడు సోదరుడు బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. సాంప్రదాయకంగ అన్న  వివాహితులు అయిన చెల్లెలు ఇంటికి వెళ్లి  ఆమె మరియు భర్త యొక్క పరిస్థితులను తెలుసుకుంటారు.  వారు ఎలా వున్నారో తెలుసుకునే అవకాశం సోదరునికి ఇచ్చారు. ఈ పండుగ ద్వారా సిస్టర్స్ కూడా వారి సోదరుల దీర్ఘకాల జీవితం మరియు మంచి ఆరోగ్యానికి ప్రార్థన, మరియు శ్రేయస్సు కోరుకుంటారు.  దీనికి ఒక కదా వుంది.  ఆ కద ఏంటి అంటే.  యముడు యమునా సోదర సోదరిమణులు.  వారు కలసి పెరిగారు.  యమున ఒక అందమైన యువరాజును  వివాహం చేసుకొని, తన సోదరుడుకు దూరమయ్యింది.  అతనిని చూడాలని ఎక్కువగా అనిపించేది . యముడు కూడా తన సోదరిని చూడాలని అనుకునేవాడు.  కానీ కుదిరేది కాదు. అతనికి ఎప్పుడూ ఖాళీ దొరికేది కాదు.  ఎందుకంటే ఆటను నరకానికి అధిపతి కదా అందుకే.  యమునా ఎప్పుడు తన అన్నని తనని చూడటానికి రమ్మని పిలిచేది.  ఇలా చెల్లి దగ్గరకు వెళ్ళటానికి కుదరటంలేదు అనుకొని.  ఒకరోజు వెళ్ళటానికి ఒక రోజును నిర్ణయించుకున్నాడు. ఆమె సోదరుడు వస్తున్నాడు అతనిని చూడచ్చు అని ఆనందం పట్టలేకపోయింది.  యమున అతనికి గౌరవార్ధం ఒక గొప్ప విందు భోజనం తయారు చేసింది. 
ఇది దీపావళి తరువాత  రెండు రోజులుకు వచ్చింది.  ఆమె తన ఇల్లంతా దీపములతో అలంకరించింది. ఆమె ఎంతో ప్రేమగా అన్ని మిఠాయిలు మరియు ఆమె సోదరుడు ప్రేమించిన ఆ పదార్ధాలు సహా, గొప్ప విందు తయారుచేసింది. ఆమె భర్త, అందమైన యువరాజు, యమున కలసి ఎంతో గొప్పగా యముడుకు స్వాగతం ఇచ్చారు.  అది చూసి యముడు  చాలా ఆనందం పొందాడు. యముడు కూడా తన సోదరి ప్రేమ పూర్వక స్వాగతం ద్వారా సంతోషపడ్డారు.  వారు చాలా కాలము తరువాత చాలా సంతోషంగా వున్నట్టు చెప్పుకున్నారు వారు.  యముడు యమునతో నీకు బహుమతులు ఏమి తీసుకురాలేదు.  నీకు ఏమి కావాలి అని చెల్లెలిని అడిగాడు.  ఆమె నాకు ఏమి వద్దు అన్నయ్య అనింది.  అప్పుడు యముడు అడుగమ్మా నేను నువ్వు ఏమి అడిగితే అది నేను తప్పక తీర్చుతాను అన్నాడు. 
వారు దేవతలు కదా వారు స్వార్ధంగా ఏమి కోరికలు అడగరు.  యమున నాకు ఒక కోరిక వుంది తీర్చుమన్నా అంది.  అది ఏమిటంటే అన్నదమ్ములు  కార్తీక విదియ రోజు తన సోదరి ఇంటికి వెళ్లి సోదరిచేతి వంట తింటారో వారికి అపమృత్యుదోషం కలగకుండా వరం ఇమ్మని కోరినది. యముడు తధాస్తు అన్నాడు.  ఈవిధంగా యమద్వితీయ జరుపుకుంటారు .  అందరికి భగినీ హస్త భోజన శుభాకాంక్షలు. 

శుక్రవారం, అక్టోబర్ 20, 2017

గోవర్ధనగిరిదారి

శుక్రవారం, అక్టోబర్ 20, 2017

ఈ కార్తీక శుద్ధ పాడ్యమినే గోవర్ధనోద్ధరణం అనే పండుగను కూడా చేసుకుంటారు. నందగోకులము లోని యాదవులకు గోసంరక్షణం ప్రధాన వృత్తి. మరి గోవులకు అవసరమైన గ్రాసం నకు ప్రధాన ఆధారం గోవర్ధనగిరి. ఈ పర్వతం పై వున్న పశు సంభంద ఆహారం గోవులకు ఆహారంగా స్వీకరించి యాదవులకు పాడి అనుగ్రహించేవి. ఈ పర్వతం పైన ఈ గ్రాసం పెరుగుటకు జలం అవసరం, ఈ జలం వర్షం ఆధారంగా వుండేది.
అందువలన యాదవులు  మేఘాలకు ప్రభువైన ఇంద్రుడు తాము గోవుల్ని మేపే గోవర్ధన గిరి మీద వర్షాలు కురిపించి పంటలు పండించటానికి ప్రతి సంవత్సరం ఇంద్ర యాగం చేస్తుంటారు.  బృందావనంలో ప్రతి సంవత్సరం ఈ పూజ ఇంద్రుని సంతృప్తి పరచడం కోసం సంరభంగా జరిపేవారు. అయితే మనం గోపాలురం కదా మనం గోవులకు పూజించాలి గాని, ఇంద్రున్ని ఎందుకని తండ్రి నందున్ని మరియు గ్రామవాసుల్ని ప్రశ్నిస్తాడు. దాని వలన ఇంద్రున్ని పూజించడం మానేస్తారు. కోపించిన ఇంద్రుడు ఏడు రోజులు కుండపోతగా రాళ్ల వర్షాన్ని కురిపిస్తాడు. అప్పుడు దిక్కు తోచని ప్రజలు కృష్ణున్ని వేడుకొనగా గోవర్ధన గిరి పర్వతాన్ని   పైకెత్తి దాని క్రింద గోపాలుర్ని మరియు గోవుల్ని రక్షిస్తాడు. ఇంద్రుడు చివరకు ఓటమిని అంగీకరించి కృష్ణున్ని భగవంతునిగా గుర్తిస్తాడు. భాగవత పురాణం ప్రకారం వేద కాలంనాటి బలిదానాల్ని వ్యతిరేకించి కర్మ సిద్ధాంతాన్ని దాని ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశాడు.  ఈ పర్వతాన్ని దీనిని హిందువులు పవిత్రంగా భావిస్తారు.  ఇది ప్రస్తుతం బృందావనం పట్టణానికి సమీపంలో ఉన్నది.

గోవర్ధన పూజ దీపావళి తర్వాత రోజు,శ్రీకృష్ణుడు ఇంద్రున్ని జయించిన రోజుగా పండుగ జరుపుకుంటారు.
కృష్ణుని మరియు వైష్ణవ భక్తులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నారు. చాలా మంది పర్యాటకులు ప్రతి సంవత్సరం ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ కొండ చుట్టూ జపాలు, గానాలు, భజనలు చేస్తూ, గిరి ప్రదక్షిణం చేస్తారు. ఈ గిరి పరిసర ప్రాంతాలలో శ్రీకృష్ణుడు మరియు బలరాముడు బాల లీలలు చాలా విశేషంగా ప్రాముఖ్యత వహించాయి.  
పరమాత్మ అవ్యక్తుడు సర్వవ్యాపకుడు నిరాకారుడు. అలాగే దేవతలుకూడా మనకు కనబడరు. కానీ సూక్ష్మ బుద్ధితో పరీక్షిస్తే ఈ ప్రకృతి (ఆది శక్తి) పరమాత్మ యొక్క ప్రత్యక్షస్వరూపం. కావున ప్రత్యక్షంగా మనకు కనిపించే ప్రకృతిని వదిలివేయుట మంచిది కాదు. మనము వేటిమీద ప్రత్యక్షంగా ఆధారపడి బ్రతుకుతున్నామో వాటినికూడా పూజించి మన కృతజ్ఞతా భావాన్ని సుస్థిరం చేసుకోవాలి.
శ్రీ కృష్ణులు వారు ప్రకృతిని పూజించాలని గోవర్ధని గిరి పూజ తో మనకు తెలియచేసారు.  
మనం ఈ గోవర్ధన గిరి వద్ద నివసిస్తాము. గోసంపదతో బ్రతుకు వారము. కావున గోవర్ధన గిరి పూజ గోమాత పూజ మనకు అత్యంత ప్రధానమ్. అందునా గోవర్ధనగిరి గోవిందుని వక్షఃస్థలం నుండి పుట్టి పులస్త్య మహర్షి అనుగ్రహంచే ఇచటికి వచ్చింది”. పరమాత్ముని అమృతవాక్యాలు విన్న వ్రజవృద్ధుడైన సన్నందుడు “ఓ నందనందన! నీవు జ్ఞానస్వరూపుడవు. నీ మాటలు మాకు శిరోధార్యములు. గోవర్ధనగిరి పూజావిధానము మాకు తెలుపుము” అని అన్నాడు. పరంధాముడు గిరిపూజా విధానం తెలిపినాడు:

“గిరి పాదభాగమును శుభ్రపఱచి గోమయముతో అలుకవలెను. రంగురంగుల ముగ్గులు వేయవలెను. పూజా ద్రవ్యములు శ్రద్ధగా సమకూర్చుకోవలెను. స్నానాది క్రియలొనర్చి భక్తితో శోడషోపచారములతో గోవర్ధనుని పూజించవలెను. అర్ఘ్యపాద్య అభిషేక అలంకరణ పుష్పపూజ దీపారాధన ప్రదక్షిణ నమస్కార స్తోత్ర నైవేద్యాది సేవలు చేసిన పిమ్మట నీరాజనమీయవలెను. విప్రసంతర్పణ గోపూజ అందరికీ అన్నదానం బాగా చేయవలెను. సాష్టాంగ ప్రణామములు చేయవలెను”.

శ్రీ కృష్ణుడు అలా పూజావిధానం తెలిపి “పూజకి వచ్చేముందు మీ కర్తవ్యాలన్నీ నిర్వహించుకుని రండి. ఇంట్లో దైవపూజ మాతాపితపూజ అన్నీ చేసుకుని రండి. వృద్ధులను బాలకులను ఆకలితో వదిలేసి రాకండి. వారికి కావలసిన ఆహారం సమకూర్చండి. ఇంటి వద్ద ఉన్న గోవులకి పశు పక్షాదులకి కుక్కలకి వేటికి కావలసిన ఆహారం వాటికిచ్చి రండి” అని చెప్పాడు.
ప్రాకృతిక వనరులను నాశనం చేయడం స్వార్థబుద్ధితో ప్రకృతిని క్షోభింపచేయడం ఎన్నడూ భారతీయత కాదు. భారతీయులు ప్రకృతిని పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపమని భావించి పూజిస్తారు. ఇదే శ్రీ కృష్ణుడు మనకిచ్చిన సందేశం.

మంగళవారం, అక్టోబర్ 17, 2017

ధన్వంతరీ త్రయోదశి

మంగళవారం, అక్టోబర్ 17, 2017

ఈరోజును ధనత్రయోదశి అని పిలుస్తారు ధనతెరాస్  అని ఐదు రోజుల సుదీర్ఘ దీపావళి సంబరాలలో మొదటి రోజు . ధనత్రయోదశి రోజున, ఐశ్వర్య దేవత అయిన మహాలక్ష్మీ పాలసముద్రము మథనం సమయంలో సముద్రము నుండి బయటకు వచ్చింది.  అందుకే, సంపద దేవుడు అయిన  కుబేరుడుతో  పాటు లక్ష్మీదేవిని , ఈ ధనత్రయోదశి రోజును  పవిత్రమైన రోజుగా  పూజిస్తారు. అయితే, లక్ష్మీ పూజ అమావాస్య రోజున మరియు ధనత్రయోదశి రెండు రోజుల్లోను  మరింత ముఖ్యమైన భావిస్తారు.  ఈరోజున నరకాసుని చెరనుండి మహాలక్ష్మిని విడుదల చేసి ఆమెని ధనమునకు మూలదేవతగా వుంచుతారు మహావిష్ణువు. ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాల్ని చేసింది ఈ రోజేనని చెబుతారు. అలాగే వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించాడు. భూలోకం మొత్తాన్నీ ఒక్క పాదంతో వామనుడు ఈ ధన త్రయోదశి నాడే ఆక్రమించాడంటారు.
 అందుకే ఈరోజును పవిత్రముగా పుజిస్తారు.  ఈరోజున బంగారము కొనుక్కోదలచినవారు కొనుక్కొని ధనలక్ష్మికి తమ శక్తీ కొలది పూజిస్తారు.  ఆరోగ్యప్రాప్తి, ఐశ్వర్య సిద్ధికోసం దైవ స్వరూపాల్ని విశేషంగా ఆరాధించే పర్వదినమే ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు ఆచరించే ఈ పండుగకు ధన్వంతరీ త్రయోదశి, యమ త్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి వంటి పేర్లూ ఉన్నాయి.  ఈరోజు ధన్వంతరి జయంతి.  ఆయుర్వేద దేవుని జయంతి జరుపుకుంటున్నాం. పరిపూర్ణ ఆయువుకోసం యమధర్మరాజును ధన త్రయోదశినాడు పూజిస్తారు. ఈ రోజు సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో నువ్వులనూనె పోసి దీపాల్ని వెలిగిస్తారు. వీటిని యమదీపాలుగా పేర్కొంటారు. యముడు దక్షిణదిక్కుకు అధిపతి కాబట్టి, ఇంటి ఆవరణలో దక్షిణం వైపున, ధాన్యపు రాశిమీద దీపాన్ని వెలిగిస్తారు. ఈ యమదీపంవల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది, అకాల మృత్యువును దరిచేరనీయడని ప్రతీతి.


ఈరోజు ధన్వంతరి జయంతి.   ఈరోజును ఆయుర్వేద వైద్యులు ధన్వంతరి జయంతిని ఘనంగా జరుపుకుంటారు.  ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు. 
ధన్వంతరి అన్న పేరు మన భారతదేశ సంస్కృతీ సాంప్రదాయాలు తెలిసిన ప్రతీ ఒక్కరికి తెలుసు . ధన్వంతరి అవతారం గురించి నాలుగు రకాలుగా చెప్తారు.  ఒకటేమో భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం సూర్యభగవానుని వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న విద్యార్ధులలో ధన్వంతరి ఒక్కరు. సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.  కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు") ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది.  విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంధాన్ని రచించాడని ఒక అభిప్రాయం కూడా వుంది.  పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" అనే బిరుదుతో సత్కరించేవారు. ధన్వన్తరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి  చెప్పబడింది. మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉన్నది.భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. లక్ష్మీదేవి  అవతరించి విష్ణువును చేరింది. తరువాత ధన్వంతరి అవతరించాడు. 
"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు.
అందరు సుఖంగా, సంతోషంగా మరియు సిరిసంపదలతో తులతూగుతూ వుండాలని కోరుకుంటూ ధనత్రయోదసి  శుభాకాంక్షలు.

సోమవారం, అక్టోబర్ 16, 2017

గోవత్స ద్వాదశి పూజ

సోమవారం, అక్టోబర్ 16, 2017


ఈరోజు మహారాష్ట్రలో గోవత్స ద్వాదశి పండుగను జరుపుకుంటారు.  ఇది ధన్తేరాస్ కు  ఒకరోజు ముందు జరుపుకుంటారు. గోవత్స ద్వాదశి పూజ హిందువులు జరుపుకునే పండుగ . 
మనం ఆవులను ఆరాధించటానికి గుర్తుగా జరుపుకుంటారు.  మానవ జీవితాన్ని కాపాడుకోవటానికి అవి చేస్తున్న  సహాయంకు  కృతజ్ఞతలు చెప్పటమే  .  ఈ సంప్రదాయము 'ద్వాదశి ' రోజు జరుపుకుంటున్నాం . దీనిని 'నందిని వ్రతము ' అని కూడా  పిలుస్తారు.  గోవత్సా ద్వాదాషి హిందూ భక్తులు దైవ ఆవు అయిన నందినిని పూజిస్తారు. ఈ పూజ వల్ల  వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఈ పండుగను  దేశంలో  అన్ని ప్రాంతాలలో అపారమైన ఉత్సాహంతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఈ రోజును  'వాసు బరస్' గా గుర్తించి పూజ చేస్తారు  మరియు దీనితోనే దీపావళి సంబరాలలో మొదటి రోజుగా పూజలు  మొదలుపెడతారు . గోవత్సా ద్వాదశి రోజునే , 'శ్రీపద వల్లభ ఆరాధన ఉత్సవ్' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం దత్తా మహాసాంధన్లో జరుగుతుంది, గుజరాత్లో 'వాగ్ బరాస్' గా జరుపుతారు.

గోవత్సా ద్వాదశి  సమయంలో ఆచారాలు:

గౌవ్సా ద్వాదశి రోజున ఆవులు ఆరాధించబడుతున్నాయి. ఒక సంప్రదాయ స్నానం చేయించి  నుదురు మీద తిలకం దిద్ది పూజ చేస్తారు. ఆవులు మరియు వారి దూడలను అందంగా ప్రకాశవంతమైన వస్త్రాలు మరియు పూల పూలలతో అందంగా అలంకరిస్తారు.
గోవత్సా ద్వాదశి రోజు కొందరు  భక్తులు ఆవుల విగ్రహాలను మరియు వారి దూడలను మట్టి తో  తయారు చేస్తారు. ఈ మట్టి విగ్రహాలు కు కుంకుం మరియు పసుపుతో అలంకరించి పూజ చేస్తారు . సాయంత్రం హారతి ' ని ఇస్తారు. 
గ్రామాలలో పశువులకు వివిధ రకాల ఆహార పదార్ధాలు సమర్పిస్తారు.
భక్తులు విష్ణువు అవతారంగా ఉన్న శ్రీ కృష్ణుడికి ప్రార్ధనలు చేస్తారు. ఆవుల పట్ల  కృతజ్ఞతలు మరియు ప్రేమను కలిగి ఉంటారు.
కొన్ని ప్రాంతాల్లో, ప్రజలు గోవత్సా ద్వాదాషి రోజున ఆవు పాలను త్రాగటం మరియు నెయ్యి ని ఉపయోగించటం మానివేస్తారు.
గోవత్సా ద్వాదాషి యొక్క ప్రాముఖ్యత మరియు దాని  పురాణము 'భవిష్య పురాణం' లో ప్రస్తావించబడింది. పురాణం లో నందిని యొక్క కథ కూడా ఉంది , దైవత్వం కల  ఆవు మరియు దూడ గా  పురాణం  చెబుతుంది. హిందూ మతంలో, ఆవులు చాలా పవిత్రంగా భావిస్తారు. వారు మానవాళికి పోషణ అందించేటప్పుడు వారు కూడా పవిత్ర మాతృమూర్తి గా  పూజిస్తారు. Govatsa Dwadashi రోజు న మహిళలు తమ పిల్లలు సుదీర్ఘ జీవితం కోసం ప్రార్ధిస్తారు . పిల్లలు లేని జంట జంటగా గోవత్సా ద్వాదాషి పూజ నిర్వహిస్తారు మరియు ఉపవాసం ఉంటే, వారికి పిల్లలతో  ఆనందంగా  ఉండే ఆశీర్వదము  కలిగి ఉంటారనే నమ్మకం ఉంది . ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, గోవత్సా ద్వాదాషి కూడా 'వాగ్' అని కూడా పిలుస్తారు, వాగ్  అనగా  ఆర్థిక రుణాలను తిరిగి చెల్లించాలని సూచిస్తుంది. అందువలన ఈ  రోజున  వ్యాపారవేత్తల్లో వారి ఖాతాల పుస్తకం ను  క్లియర్ చేసి, వారి నూతన  లావాదేవీలు దీవాలి తో మొదలుపెడతారు . గోవత్సా ద్వాదశి  రోజు ఆవులు ను పూజించి న వ్యక్తి సమృద్ధిగా మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుతాడు అని నమ్ముతారు. మనం పూజించే ముక్కోటి దేవతలు  గోమాతలో ఉంటారుట.  గోవును పూజిస్తే మనం ఒకసారి ముక్కోటి దేవతలను పూజించినట్టే వారి దీవెనలు మనకు అందినట్టే.  
గోవత్స ద్వాదశి పూజ గురించి బాగుంది కద . 
"గోవులను పూజించండి.  గోవధను వ్యతిరేకించండి "అదే మన హిందూ సాంప్రదాయం . 

బుధవారం, అక్టోబర్ 11, 2017

"ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు"

బుధవారం, అక్టోబర్ 11, 2017


ఈరోజుకొక విశేషము వుంది అది ఏమిటంటే.  మనందరికీ చీకటి నుండి తెల్లవారాక ముందే వారికి  తెల్లవారుతుంది. చకాచకా పరిగెడుతూ పరిగెడుతూ సైకిల్ మీద వార్తా పత్రికలు ప్రతి ఇంటికి ప్రతీ వీధి  వీధి కీ  వార్తాపత్రికలును వేసి తొందర తొందరగా వార్తా పత్రికలను అందిస్తూ ఉంటాడు.    పల్లెటూరులో అయితే కొక్కొరోకో అనే కోడి అరుపుతో తెల్లారుతుంది. మరి  మన ఇంటి ముందర పాల పేకట్లు తో పాటు  ప్రఫంచం అంతటా ఎమి జరిగిందో,  ఏమి జరగబోతోందో తెలపటానికి వార్తా పత్రిక కూడా వుంటుంది.  వార్తాపత్రికలు  చూస్తే  కానీ మనకు తెల్లవారిన అనుభూతి రానే రాదు.  వేడి వేడి కాఫి పట్టుకొని పేపర్ చదవటం ప్రతి ఇంట్లో జరిగే రోజు జరిగే మొదటి పని. అందరు దేవదేవుని సుప్రభాతము వింటారో వినరో కానీ పేపరు చదవకుండా వుండలేరు.   ఆ పేపర్ చేరటం ఆలస్యం అయితే మనమే అతని కోసం ఎదురు చూస్తాం.  ఈ పేపరు మన ఇంటికి చేర్చేది పేపర్ బోయ్ నే.  వాతావరణం ఎలా వున్నా.  తెల్లారేసరికి మన ఇంటికి పేపర్ అందిస్తాడు పేపర్ బోయ్.    

ఈరోజు ప్రపంచం అంతా  "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" జరుపుకుంటున్నారు.  
మొట్టమొదటి న్యూస్ బాయ్ (దినపత్రికలు ఇంటికి పంచేవాడు) (బార్నీ ఫ్లాహెర్టీ - న్యూయార్క్ సన్ పత్రిక 1833 నుంచి 1950వరకు ప్రచురణ అయ్యింది). చదువుకుంటూనే పేపర్ బాయ్ లుగా పని చేసి ఎంతో మంది సమాజంలో ఉన్నతస్థాయికి ఎదిగారు.  ఉదాహరణకు రామేశ్వరంలో పుట్టిన అబ్దుల్ కలాం పేపర్ బాయ్‌ నుండి జీవితాన్ని మొదలుపెట్టి భారత రాష్ట్రపతి వరకు ఎదిగారు. 

అలాగే పేపర్ బాయ్ గా సంపాదన మొదలు పెట్టి ఇండియాన్ ఐడల్ 2017 రేవంత్ విజేతగా నిలిచాడు.  ఇలాంటి వారిని చూసి మనం ఆదర్శంగా తీసుకోవాలి.  మనం జీవితంలో ఏదన్నా సాధించాలి అంటే చాలా కష్టపడాలి.  అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలకు చేరగలం.  
పేపర్ బోయ్స్ అందరికి "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" శుభాకాంక్షలు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)