Blogger Widgets

సోమవారం, జనవరి 02, 2012

తిరుప్పావై నవాదస పాశురం

సోమవారం, జనవరి 02, 2012

ముందు పాశురములో పొడుగు జుట్టు గల నీలాదేవి ని మేల్కొల్పి .  ఈ రోజు నీలాదేవిని మేలుకొలిపినా ఈ పాశురములో శ్రీ కృష్ణుని,నీలాదేవిని కూడా మేలుకోల్పవలసినది గా అర్ధించుచున్నారు.  లేచి వారితో మాటాలాడమని కోరుకొని నీలాదేవిని అర్ధిస్తున్నారు కాసేపు అయినా మాతో మాటాడనీ అంటున్నారు. మరి ఎలా అన్నది తెలుసుకుందాం.   నీలాదేవిని కీర్తిస్తున్నవారు ఈ పాశురములో అమ్మవారిని దర్శించ వచ్చునని పెద్దలు అంటారు

పాశురము 
  కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్ 

కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్
మెత్తెన్ఱ పంచ శయనత్తిన్ మేల్ ఏఱి
కొత్తలర్ పూంగురల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తు క్కిడంద మలర్ మార్బా! వాయ్ తిఱవాయ్
మైత్తడంకణ్ణినాయ్! నీ ఉన్-మణాళనై
ఎత్తనై పోదుం తుయిలెర ఒట్టాయ్ కాణ్
ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్
తత్తువమన్ఱు తగవ్-ఏలోర్ ఎంబావాయ్


తాత్పర్యము: ఒక గుత్తి దీపములు చుట్టును వేలుగుచుండగా , ఏనుగు దంతము లతో చేయబడిన కోళ్ళు గల మంచముపై నున్న, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము,ఎత్తు , వెడల్పు కలిగిన పాన్పులపై ఎక్కి , గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకోనిన కేశ పాశము గల నీలాదేవి యొక్క స్థనములపై తన శరీరమును ఆనుకొని పరుండి విశాలమైన వక్షస్థలము గల శ్రీ కృష్ణా నోరు తెరచి మాట్లాడు . కాటుక పెట్టికోనిన విశాలమైన కన్నులు కల ఓ నీలాదేవి ! నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీవు?ఇంత మాత్రపు ఎడబాటుకుడా ఓర్వ లేకుండుట నీ స్వరుపమునకు, నీ స్వభావమునకు తగదు.  

డా.హరగోవింద ఖురానా

హరగోవింద ఖురానా
జీవరసాయన శాస్త్ర పరిశోధనలకు మొదటగా బంగారు బాట వేసినది  డా.హరగోవింద ఖురానా .  ఈయన పంజాబ్ లోని  కుగ్రామం రాయ్‌పూర్‌లో 1922  జనవరి 2  న లో జన్మించారు. ఈ గ్రామము ప్రస్తుత పాకిస్థాన్‌లో ఉన్నది. ఆ గ్రామంలో పేదరికంలో పుట్టి పెరిగిన ఆయనకు 1968లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.  Massachusetts Institute of Technology (MIT) జీవ, రసాయనిక శాస్త్ర విభాగాల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 


ప్రొటీన్ల సంశ్లేషణలో ఆర్‌ఎన్‌ఏ సంకేతాల తీరుపై చేసిన పరిశోధనలు ఆయనకు నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టాయి. 
మరో ఇద్దరితో కలసి ఆయన ఈ బహుమతిని పంచుకున్నారు.  డీఎన్‌ఏ రసాయనిక ధర్మాలపై జరిపిన పరిశోధనలు ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. విస్కాన్సిన్ వర్సిటీలో 1960-70ల కాలంలో ఆయన సాగించిన పరిశోధనలు పలు భావి ఆవిష్కరణలకు దోహదపడ్డాయి. విస్కాన్సిన్‌లో దాదాపు దశాబ్దకాలం బోధన, పరిశోధనలు కొనసాగించిన తర్వాత ఆయన MITలో చేరారు. యువ శాస్త్రవేత్తలకు తర్ఫీదు ఇచ్చేందుకు తన ఎక్కువగా ఇష్టపడేవారు. రిటైరైన తర్వాత కూడా పలువురు యువ శాస్త్రవేత్తలు ఆయన వద్దకు వచ్చేవారని అన్నారు. 




"Gobind was a brilliant, path-breaking scientist, a wise and considerate colleague, and a dear friend to many of us at MIT, said Chris Kaiser, MacVicar professor of biology and head of the department of biology, in an e-mail announcing the news to the department 's faculty.

పేదరికంలోనూ తమను చదివించేందుకు తన తండ్రి తన జీవితాన్నే అంకితం చేశారని ఖురానా తన ఆత్మకథలో రాసుకున్నారుఅతని విజయంలో ఒక సోదరి మరియు ముగ్గురు సోదరులు బాగా support  గా నిలిచారని.  తన తండ్రి బ్రిటిష్ ఇండియన్ ప్రభుత్వ నకు  ఒక పట్వారి  (ఒక వ్యవసాయ పన్నుclerk) గా పనిచేసేవారనీ .దాదాపు వంద కుటుంబాలు గల తమ స్వగ్రామంలో అక్షరాస్యత సాధించిన తొలి కుటుంబం తమదేనని ఆయన చెప్పుకున్నారు. ముల్తాన్ వద్ద హైస్కూలు విద్య పూర్తి చేసుకున్న ఖురానా, పంజాబ్ వర్సిటీ నుంచి 1943లో కెమిస్ట్రీలో డిగ్రీ, 1945లో బయోకెమిస్ట్రీలో పీజీ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్‌లో ఉండగానే, బ్రిటన్‌లోని లివర్‌పూల్‌లో చదువుకునేందుకు ఆయనకు స్కాలర్‌షిప్ లభించింది. అక్కడే ఆయన 1948లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. స్విట్జర్లాండ్‌లోని ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పోస్ట్‌డాక్టరల్ పరిశోధనలు సాగించారు. తను ఈ స్తాయికి చేరటానికి జీవితంలో చాలా కష్టపడ్డారని తన biography లో రాసుకున్నారు.


కేంబ్రిడ్జిలో మరో పోస్ట్‌డాక్టరల్ పరిశోధన చేశారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా వర్సిటీలో ఉద్యోగం లభించడంతో 1952లో వాంకోవర్ నగరానికి చేరుకున్నారు. అక్కడ ఎనిమిదేళ్లు ఉద్యోగం చేశాక, 1960లో అమెరికాలోని విస్కాన్సిన్ వర్సిటీలో చేరారు. అక్కడే ఆయన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎంజైమ్ రీసెర్చ్ కోడెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, కీలకమైన పరిశోధనలు సాగించారు.  ఈయన నవంబర్ 9 , 2011  న పరమపదించినారు.
ఇండియన్ స్టూడెంట్స్ ఆయనని చూడటానికి వెళ్ళినప్పుడు
డా.హరగోవింద ఖురానా
జననము                     - 1922  జనవరి 2  న
మరణము                    - నవంబర్  9, 2011 న   
మాతృదేశము                     -భారతదేశము  
జాతీయత                           - భారతీయుడు 
రంగము                             -జీవ, రసాయన శాస్త్రము
ముఖ్య విభాగము                -Massachusetts Institute of Technology 
ముఖ్య పురస్కారాలు          -
నోబెల్ బహుమతి

జై హింద్

ఆదివారం, జనవరి 01, 2012

తిరుప్పావై అష్టాదస పాశురము

ఆదివారం, జనవరి 01, 2012

గోపికలు కృష్ణుని పొంది యనుభవించాలని ఆవేసముచే కృష్ణపరమాత్మ కనిపించగానే తామూ అనుభవించ వచ్చునని తొందరగా మేలుకొన్నారు. కాని శ్రీ కృష్ణుడు మేలుకోలేదు. తరువాత బలరాముని మేలుకోల్పారు . అప్పుడు కుడా కృష్ణుడు మేలుకోలేదు . తెలివి తెచ్చుకొని నీలాదేవి ద్వారా మేలుకోల్పవచ్చని ఆమెని మేలుకోల్పుతున్నారు ఈ పాశురములో . 

పాశురము:
  ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్ 

ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ
శెందామరై క్కైయాల్ శీరార్ వళై ఒలిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్-ఏలోర్ ఎంబావాయ్


తాత్పర్యము :
ఏనుగులతో పోరాడగలిగినవాడును, మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలముకలవాడును, మదము స్రవించుచున్న ఏనుగులు కలవాడును, యుద్దములో శత్రువులను చూచి వెనుకకు జంకని భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడలా ! సుగంధము వెదజల్లు కేశ పాశము గల ఓ నీలాదేవి ! తలుపు గడియ తెరువుము . కోళ్ళు అంతటా చేరి అరుస్తున్నాయి . మదవీలతప్రాకిన పందిరిమీద గుంపులు గుంపులుగా కూర్చొని కోకిలలు కూస్తున్నాయి. కావున తెల్లవారినది , చూడు. బంతిని చేతిలో పట్టుకోన్నదానా! మీ బావ గుణములను కీర్తించుటకు వచ్చితిమి . నీవు సంతోషముతో లేచి నడచి వచ్చి. ఎర్ర తామర పూలు ను పోలిన నీ చేతితో, అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుము.  అని నీలాదేవిని కీర్తిస్తున్నారు . ఈ పాశురములో అమ్మవారిని దర్శించ వచ్చునని పెద్దలు అంటారు.

జై శ్రీమన్నారాయణ్

సర్ శాంతి స్వరూప్ భట్నాగర్


శాంతి స్వరూప్ భట్నాగర్ 
శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజులు ప్రతీ సంవత్సరం 5 శాస్త్ర, సాంకేతిక రంగాలలో కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్ ద్వారా బహుమతించబడతాయి.
జీవ శాస్త్రాలు
భూమి, వాతావరణ, అఘాత మరియు ఖగోళ శాస్త్రాలు
భౌతిక శాస్త్రాలు
వైద్య శాస్త్రాలు
రసాయన శాస్త్రాలు
సాంకేతిక శాస్త్రాలు
గణిత శాస్త్రాలు
శాంతి స్వరూప్ భట్నాగర్ (ఫిబ్రవరి 21, 1894 – జనవరి 1, 1955) ప్రసిద్ధిగాంచిన భారతీయ శాస్త్రవేత్త. భట్నాగర్ ను భారత పరిశోధన శాలల పితామహుడిగా అభివర్ణిస్తారు. బ్రిటీష్ ఇండియాలోని షాపూర్ (ఇప్పుడు పాకిస్థాన్ లో ఉంది)లో జన్మించాడు.ఈయనికి  చిన్నప్పటి నుంచి బొమ్మలు, యంత్ర పరికరాలు చేయటంలో ఆసక్తి కనబరిచేవారు.  వీరి పరిశోధనలు ఎక్కువగా పారిశ్రామిక రసాయనాలపై జరిగింది. ఆయన శాస్త్రీయ పరిశోధనకు 1941లో బ్రిటన్ ప్రభుత్వం సర్ బిరుదును ప్రదానం చేసింది.భారత స్వాతంత్యం తరువాత కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ సంస్థకు తొలి డైరెక్టర్ జనరల్ పదవి అలంకరించాడు.  మన దేశంలో మొత్తం 12 పరిశోధన శాలలను ఈయన స్థాపించాడు.  ఈతని జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం స్థాపించింది.  అంత గొప్ప శాస్త్రీయవేత్త గురించి తెలుసుకొని ఆయనికి నివాళు అర్పిస్తున్నాను. 
జననం                                  -ఫిబ్రవరి 21 1894, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
మరణం                                 -జనవరి 1 1955,  న్యూఢిల్లీ, భారతదేశం
నివాసం                                 -భారతదేశం  
జాతీయత                               -భారతీయుడు
రంగము                                 -రసాయన శాస్త్రం
సంస్థ                                      -శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధనా కౌన్సిల్
మాతృ సంస్థ                           -పంజాబ్ విశ్వవిద్యాలయం  యూనివర్శిటి కాలేజ్ ఆఫ్ లండన్
ప్రాముఖ్యత                             -భారతీయ ఖగోళ కార్యక్రమం
ముఖ్య పురస్కారాలు               -పద్మవిభూషణ్  OBE , Knighthood 
జై హింద్ 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)